: ఇక స్వదేశంలో 'విదేశీ' విద్య
ఇన్నాళ్లూ అత్యున్నత నాణ్యతతో కూడిన విద్య కోసం ప్రతిభావంతులు విదేశాలకు పరుగులు తీసేవారు. ఇకపై అంత శ్రమ లేకుండానే స్వదేశంలో విదేశీ విశ్వవిద్యాలయాల ద్వారా నాణ్యమైన విద్యను అందుకోవచ్చు. ప్రపంచంలో టాప్ 400 వర్సిటీలు దేశంలో క్యాంపస్ లు ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. ఇందుకోసం చట్టం చేయాలనుకుంటున్నా ఆలస్యం అవుతుండడంతో ఎగ్జిక్యూటివ్ ఆదేశాల ద్వారా విదేశీ విద్యాసంస్థలను అనుమతించాలని నిర్ణయించింది. ఈ విద్యాసంస్థలు భారతీయ విద్యాసంస్థల భాగస్వామ్యం లేకుండా సొంతంగానే ప్రారంభించవచ్చు. దీనివల్ల భారతీయులు శ్రమకోర్చి విదేశాలకు వెళ్లే బాధ తప్పుతుంది. డాలర్ల కోసం డిమాండ్ కూడా తగ్గుతుంది.