: చిరంజీవితో పొత్తు పెట్టుకుని ఉంటే 50 సీట్లు గెలిచేవాళ్లం: కెసిఆర్


2009 శాసనసభ ఎన్నికల్లో అప్పటి ప్రజారాజ్యం అధ్యక్షుడు నేటి కేంద్ర మంత్రి చిరంజీవితో పొత్తుపెట్టుకుని ఉంటే 50 సీట్లు గెలిచి ఉండేవాళ్లమని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె చంద్రశేఖర్ రావు వ్యాఖ్యానించారు. ఆ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు వద్దని చెప్పానని కెసిఆర్ అన్నారు. 

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వరదారెడ్డి ఎంపిక తప్పేనని కెసిఆర్ అన్నారు. అయితే కొంతమంది నేతల ఒత్తిడి వల్లే ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కొత్తగా ఎన్నికైన టీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు ఆయన వివరించారు. తాను ఎంపిక చేసిన నేతలు ఎప్పుడూ విజయం సాధించారని..ఈ సందర్భంగా కెసిఆర్ అన్నారు.

  • Loading...

More Telugu News