: షుగరుకు చెక్కతో చెక్‌ పెట్టవచ్చు


మనం వంటల్లో వాడే పలు రకాలైన దినుసులు మన ఆరోగ్యానికి నిర్దేశించినవే. అందునా మసాలా దినుసుల్లో వాడే వాటిలో దాల్చిన చెక్కతో పలు ప్రయోజనాలున్నాయి. దీనితో జ్ఞాపకశక్తి మెరుగవుతుంది అని కూడా కొందరు చెబుతారు. ఈ దాల్చిన చెక్క ఇప్పుడు షుగరు వ్యాధి ఉన్నవారికి చక్కగా పనిచేస్తుందని తాజా పరిశోధనలో తేలింది. ఈ వ్యాధిగ్రస్తులకు దాల్చిన చెక్కని వాడడం వల్ల వారి రక్తంలోని షుగరు నిల్వల పరిస్థితి మెరుగుపడినట్టు ఈ పరిశోధనలో తేలింది.

కాలిఫోర్నియాలోని వెస్టర్న్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌కు చెందిన పరిశోధకులు మధుమేహ రోగులకు దాల్చినచెక్క చక్కగా తోడ్పడుతున్నట్టు తమ పరిశోధనలో గమనించారు. టైప్‌2 మధుమేహంతో బాధపడేవారికి రక్తంలో చక్కెర నిల్వల పరిస్థితి మెరుగయ్యేందుకు దాల్చినచెక్క ఉపకరిస్తున్నట్టు వీరి పరిశోధనలో తేలింది. ఈ అధ్యయనంలో భాగంగా కొంతమంది వాలంటీర్లకు 120 మిల్లీగ్రాముల నుండి 6 గ్రాముల దాకా పరిమాణం ఉన్న దాల్చినచెక్క సప్లిమెంట్లను మాత్రల రూపంలో నాలుగునుండి 18 వారాలపాటు ఇచ్చి పరిశీలించారు. వీరిలో దాల్చినచెక్క సప్లిమెంట్లను తీసుకున్న వారిలో ఆహారం తీసుకోకముందు గ్లూకోజ్‌ నిల్వలు తగ్గినట్టు నిర్ధారించారు. అన్నిరకాల ట్రయల్స్‌ నుండి ఫలితాలను సమ్మిళితం చేసినప్పుడు టైప్‌2 మధుమేహ రోగుల్లో రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్‌ స్థాయిలకు సంబంధించి మంచి ప్రయోజనాలు కలిగిస్తున్నట్టు ఈ పరిశోధనలో పాల్గొన్న ఒలీవియా ఫంగ్‌ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News