: ఎమ్మీ అవార్డ్ వేడుకలో ఎల్టన్ జాన్ కచేరీ


ప్రముఖ గాయకుడు సర్ ఎల్టన్ జాన్ ఈ నెల 22న లండన్ లో జరుగనున్న ఎమ్మీ అవార్డు ప్రదానోత్సవంలో పాడనున్నారు. 66 ఏళ్ల ఈ 'రాకెట్ మ్యాన్' గాయకుడు ఎమ్మీ అవార్డుల కార్యక్రమంలో.. పియానో వాయిద్యకారుడు, గాయకుడు అయిన అమెరికా కళాకారుడు లిబరేన్ కి నివాళి అర్పించనున్నాడు. లిబరేన్ జీవితం ఆధారంగా హెచ్ బీవో ఇటీవలే ఓ చలనచిత్రం రూపొందించింది. దీనికి 15 ఎమ్మీ నామినేషన్లు లభించాయి. కాగా, ఎమ్మీ అవార్డుల వేదికపై ఎల్టన్ జాన్ పాడనుండడం ఇదే తొలిసారి.

  • Loading...

More Telugu News