: సీమాంధ్ర పక్షపాతిని కాను: సీఎం


రాష్ట్రం సమైక్యంగా ఉండాలని తాను కోరుకుంటున్న మాట నిజమేనని... అలాగని సీమాంధ్రకి అనుకూలం కాదని సీఎం కిరణ్ స్పష్టం చేశారు. ఈ రోజు ముఖ్యమంత్రిని తెలంగాణ మంత్రులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏపీఎన్జీవోల సభకు మీ మద్దతుందని, సీమాంధ్రకు మీరు అనుకూలంగా ఉన్నారని అందరూ అనుకుంటున్నారని టీ మంత్రులు ముఖ్యమంత్రితో అన్నారు. దీనికి సమాధానంగా సీఎం పైవిధంగా స్పందించారు. తాను ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రినని, తనకి అందరూ సమానమేనని ఆయన అన్నారు. 'తెలంగాణవాదుల సభకు మీరు మద్దతు తెలిపినప్పుడు మీ మనోభావాలను అర్థం చేసుకున్నాను. ఏపీఎన్జీవోలు సభ పెట్టుకుంటామన్నప్పుడు వారి మనోభావాలను అర్థం చేసుకున్నాను' అని వివరణ ఇచ్చారు.

  • Loading...

More Telugu News