: ఏపీఎన్జీవోలపై దాడి కేసులో ఐదుగురి అరెస్టు
ఈనెల 7న 'సేవ్ ఆంధ్రప్రదేశ్' పేరిట సభ జరుపుకుని స్వస్థలాలకు తరలి వెళుతున్న ఏపీఎన్జీవోలపై హైదరాబాదు శివారు వనస్థలిపురం వద్ద దాడి చేసిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు కారణమని భావిస్తున్న ఐదుగురిని పోలీసులు ఈ సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఎల్బీ నగర్ కు చెందిన ఓ పార్టీ నేత యాదయ్యతో పాటు నలుగురు విద్యార్థులున్నారని సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.