: గర్భంలోని శిశువుకు మన మాటలు అర్థమౌతాయట!
మహాభారతంలో అభిమన్యుడు తల్లి గర్భంలో ఉండగానే తండ్రి అర్జునుడు చెబుతున్న యుద్ధ తంత్రం పద్మవ్యూహాన్నివిన్నాడని పెద్దలు అంటారు. తాజాగా తల్లి గర్భంలో ఉండగానే శిశువుకు ధ్వనులలో బేధం తెలుస్తుందని అంటున్నారు ఫ్రెంచ్ దేశానికి చెందిన పికార్డి విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు. గర్భంలో ఉన్న పిండానికి ఆరో నెల రాగానే చెవులు ఏర్పడతాయని.. ఆ తర్వాత శిశువు తల్లి గొంతుని, తండ్రి గొంతుని కూడా తెలుసుకోగలదని అంటున్నారు శాస్త్రవేత్తలు.
గర్భంలోని శిశువుపై శాస్త్రవేత్తలు 28 వారాలపాటు ఆప్టికల్ స్కానింగ్ పరీక్షలు నిర్వహించారు. వీటి ద్వారా ధ్వనులలో బేధాలను శిశువు గుర్తించగలదని నిర్థారించారు. అయితే గర్భంలో ఉండగానే శిశువులు మన మాటలను అర్థం చేసుకుంటారా? లేక పుట్టిన తర్వాతే అర్థం చేసుకుంటారా? అనే అంశంపై శాస్త్రవేత్తలు ఇంకా లోతుగా అధ్యయనం చేస్తున్నారు.