: మోహన్ బాబు లేఖపై తమ్మారెడ్డి స్పందన


భారతీయ సినిమా వందేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా చెన్నైలో ఈనెల 21 నుంచి 24 వరకు మూడు రోజుల పాటు ఉత్సవాలు జరగనున్న సంగతి తెలిసిందే. దీనిపై నటుడు మోహన్ బాబు నేడు తిరుమలలో చేసిన వ్యాఖ్యలపై ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. ఇలాంటి సినీ పండగల్లో రాజకీయాలకు చోటు ఉండరాదని పేర్కొన్నారు. మోహన్ బాబు సూచన సరికాదన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం అస్తవ్యస్త పరిస్థితులున్న తరుణంలో ఇలాంటి వేడుకలు చేసుకోవడం సమంజసం కాదని మోహన్ బాబు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తాను ఫిల్మ్ ఛాంబర్ కు ఓ లేఖ రాశానని కూడా చెప్పుకొచ్చారు.

కాగా, టాలీవుడ్ నుంచి ఈ వేడుకలకు వెళ్ళే వ్యక్తులు దర్శకుల సంఘాన్ని సంప్రదించాలని తమ్మారెడ్డి సూచించారు. ఈ విషయమై తనకు ఫోన్ చేయాల్సిన అవసరంలేదన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 22న తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులకు సన్మానం ఉంటుందని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News