: రాహుల్ కోసమే రాష్ట్ర విభజన అనడం తప్పు: మంత్రి బాలరాజు


రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయడానికే రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నారన్న వాదనను మంత్రి బాలరాజు తప్పుపట్టారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీని తప్పుపట్టరాదని అన్నారు. హైదరాబాదులో నేడు మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ ప్రధాని కావాలనుకుంటే ఎంతో సమయం పట్టదని... ఈ రోజే కాగలరని తెలిపారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజల సంక్షేమం కోసమేనని తెలిపారు. విపక్షాలవి కేవలం ఓటు రాజకీయాలేనని ఆయన దుయ్యబట్టారు. కాంగ్రెస్ హైకమాండ్ తీసుకునే నిర్ణయాలకు తాను కట్టుబడి ఉంటానని బాలరాజు తెలిపారు. ఏ సమస్యకైనా ఒక పరిష్కారం ఉంటుందని... మన రాష్ట్ర విభజనకు కూడా ఒక పరిష్కారం తప్పకుండా ఉంటుందని తెలిపారు.

  • Loading...

More Telugu News