: గణేశ్ నిమజ్జనం పై హైకోర్టు ఉత్తర్వులు
హుస్సేన్ సాగర్ సహా ఇతర సరస్సులలో గణేశ్ విగ్రహాలు నిమజ్జనం చేయడంపై హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గణేశ్ విగ్రహాల నిమజ్జనంపై 2001లో ఇచ్చిన ఆదేశాలు వర్తింపజేయాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ ఏడాది గణేశ్ నిమజ్జనానికి ఆటంకాలు తప్పేట్టు కన్పించడం లేదు. గణేశుడి విగ్రహాలను పెద్దఎత్తున హుస్సేన్ సాగర్, మరికొన్ని సరస్సులలో నిమజ్జనం చేస్తున్నందున వ్యర్థాలతో పాటు పెద్దఎత్తున పర్యావరణానికి హాని చేసే రసాయనాలు నీటిలో కలుస్తున్నాయని గతంలో సామాజిక కార్యకర్తలు పిటిషన్ దాఖలు చేశారు.