: 41కి చేరిన ముజఫర్ నగర్ మృతుల సంఖ్య


ఉత్తరప్రదేశ్ ముజఫర్ నగర్ అల్లర్లలో మృతుల సంఖ్య పెరిగిపోతోంది. ఓవైపు ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామని చెబుతున్నప్పటికీ అల్లర్ల మృతుల సంఖ్య అర్ధ సెంచరీకి చేరువవుతోంది. నిన్నటికి 36 మంది ఈ ఘటనలో మృతి చెందగా ఈ రోజు 41కి చేరింది. ముజఫర్ నగర్ జిల్లా వ్యాప్తంగా కర్ఫ్యూ కొనసాగుతోంది. అయినప్పటికీ చెదురుమదురు సంఘటనలు ఆగడం లేదు. పోలీసులు సంఘటనా స్థలానికి ఎవరినీ అనుమతించడం లేదు. మరోవైపు కేంద్రం కూడా జరుగుతున్న ఘటనలను పరిశీలిస్తోంది. అదనపు బలగాలు కావాలంటే పంపించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తన సంసిద్ధతను తెలియజేసింది. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మాత్రం త్వరలోనే అన్ని పరిస్థితులు చక్కబడతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News