: సీఎం వ్యవహారశైలిని మార్చుకోవాలి: డీకే అరుణ
ముఖ్యమంత్రి కిరణ్ కేవలం సీమాంధ్ర ప్రాంతానికి మాత్రమే సీఎంగా వ్యవహరిస్తున్నారని మంత్రి డీకే అరుణ ఆరోపించారు. అందుకే టీ కాంగ్రెస్ నేతలు ఆయనకు దూరంగా ఉంటున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి తన వ్యవహారశైలిని మార్చుకుని.. ఇరుప్రాంత నేతలతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన ఆగిపోతుందని సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ నాయకులు అక్కడి ప్రజలను మభ్యపెడుతున్నారని తెలిపారు. ఎవరెన్ని చేసినా తెలంగాణ ఏర్పాటు ఖాయమని అరుణ తెలిపారు.