: ఇండోనేషియాలో భూకంపం


ఇండోనేషియాలోని సులవేసి ద్వీపకల్పంలో ఈ రోజు తెల్లవారుజామున భూకంపం సంభవించింది. వాయువ్య ప్రాంతంలో ఉన్న గొరొంటా నగరంలో ఇది సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.7 గా నమోదయింది. ఈ సంఘటన వల్ల ఎలాంటి నష్టం వాటిల్లలేదని అధికారులు వెల్లడించారు. ఇటీవల కాలంలో ఇండోనేషియాలో తరచుగా భూకంపాలు సంభవిస్తుండటం తెలిసిందే.

  • Loading...

More Telugu News