: ఆఫ్ఘన్ లో భారత రచయిత్రి కాల్చివేత కేసులో ఇద్దరు అరెస్టు
ఆఫ్ఘనిస్తాన్ లో భారత రచయిత్రి సుస్మిత బెనర్జీ కాల్చివేత కేసులో ఆఫ్ఘన్ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. నిందితులు మహమ్మద్ యాకూబ్, మహమ్మద్ ఆసిఫ్ లుగా పోలీసులు గుర్తించారు. సుస్మిత రాసిన 'కాబూలీ వాలాస్ బెంగాలీ వైఫ్' పుస్తకంలో 1995లో తాలిబన్ల నుంచి ఎలా తప్పించుకున్నది అందులో వివరించారు. కాగా, ఆమె ఇంట్లో ఎన్నో ఇంటర్నెట్ కనెక్షన్లు కలిగి ఉన్నారని, అభ్యంతరకరమైన రాతలు రాస్తున్నందునే ఆమెను హతమార్చినట్లు నిందితులు విచారణలో తెలిపినట్లు ఆఫ్ఘన్ పోలీసులు చెప్పారు.