: పాతదేకదా అని తీసిపారేయలేం కదా!


పాత వస్తువేకదా... అని కొన్ని వస్తువులను మనం తీసి పారేస్తుంటాం. అయితే కొన్నింటిని మాత్రం పాతవైనా వాటిని మనతోబాటే అట్టేపెట్టేసుకుంటాం. ఇలా పాత వస్తువులపై మోజుతో ఒక అజ్ఞాత వ్యక్తి ఒక పాతకాలం నాటి రోబోను లక్షలు వెచ్చించి సొంతం చేసుకున్నాడట.

రోబోలను తయారు చేయడం మొదలుపెట్టిన తొలినాళ్లలో ఒక అల్యూమినియం మరమనిషిని ఇటలీకి చెందిన ఒక డిజైనర్‌ తయారుచేశారు. ఈ రోబోపేరు సైగాన్‌. ఇతను ఇప్పటి రోబోల్లాగా పెద్ద పెద్ద పనులు చేయకున్నా... అప్పట్లో డ్రింకు క్యానులను తీసి ఇచ్చేవాడు. దీంతో అందరూ నోరెళ్లబెట్టి చూశారు. తర్వాత క్రమేపీ రోబోల తయారీలో పలు మార్పులు వచ్చేశాయి. ఇప్పుడు మనలాగే మాట్లాడడమేకాదు... అంతరిక్షాన్ని కూడా చుట్టివచ్చే రోబోలను శాస్త్రవేత్తలు తయారుచేస్తున్నారు. అయితే ఇప్పుడు పాతకాలంనాటి సైగాన్‌ ను బ్రిటన్‌లోని సౌత్‌ కెన్సింగ్‌టన్‌లో క్రిస్టీస్‌ సంస్థ వేలం వేసింది. ఈ పాత రోబో 8 లేదా 9 లక్షలకు మించి పెద్దగా ధర పలకదని సదరు సంస్థవారు భావించారు. అయితే ఈ అంచనాలను తల్లకిందులు చేస్తూ సైగాన్‌ ను 18 లక్షల రూపాయలకు ఒక అజ్ఞాత వ్యక్తి కొనుక్కొన్నాడట. మొత్తానికి పాతకాలం నాటి వస్తువులపై కొందరికి మమకారం ఇలా లక్షలు ఖర్చుపెట్టిస్తుందేమో...!

  • Loading...

More Telugu News