: బొగ్గు శాఖపై దాడికి సిద్దమౌతున్న సీబీఐ
1.86 లక్షల బొగ్గు కేటాయింపుల కుంభకోణాన్ని దర్యాప్తు చేస్తున్న సీబీఐ గల్లంతైన దస్త్రాల అన్వేషణలో భాగంగా, చివరి ప్రయత్నంగా బొగ్గు శాఖ కార్యాలయాలపై దాడులు చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యాలయానికి ఎన్నిసార్లు రిమైండర్లు పంపినా తమకు ఎలాంటి స్పందనా రాలేదని అందుకే సెప్టెంబర్ 15 తరువాత ప్రత్యక్షంగా దాడులు చేసి దొరికిన రికార్డులను స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నామని సీబీఐ దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు. దీంతో బొగ్గు కార్యాలయంపై దాడులు మినహా మరో గత్యంతరం లేదని సీబీఐ అభిప్రాయపడుతోంది.