: ఉద్యమం, సభపై సీమాంద్ర కేంద్ర మంత్రులు, ఎంపీల సమీక్ష: లగడపాటి


సమైక్యాంధ్ర ఉద్యమం, హైదరాబాద్ లో సభపై సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు చర్చిస్తామని ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ ఏపీఎన్జీవోల సభ అనంతరం తిరిగి వెళ్తున్న సీమాంధ్ర ఉద్యోగి కట్టా సత్యనారాయణపై జరిగిన దాడిని ఖండించారు. దీనిపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. సత్యానారాయణ చికిత్స పొందుతున్న అపోలో ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. రాళ్ల దాడికి పాల్పడినవారి కంటే దానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. నిందితులను రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. అతనిపై జరిగిన దాడి ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడిగా ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి అభివర్ణించారు.

  • Loading...

More Telugu News