: బీజేపీ కార్యాలయంలో ఘనంగా చవితి పూజ
హైదరాబాద్ లోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో వినాయక చవితి పూజలు ఘనంగా జరిగాయి. మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, దత్తాత్రేయ తదితరులు పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు వినాయకచవితి శుభాకాంక్షలు తెలియజేశారు.