: నేటి నుంచి కేరళలో ప్రైవేటు బస్సులు బంద్
కేరళ రాష్ట్రంలో నేటి నుంచి ప్రైవేటు బస్సుల యజమానులు సమ్మెకు దిగుతున్నారు. బస్సులకు స్పీడ్ గవర్నెన్స్ పరికరాన్ని బిగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వారు సమ్మెకు పిలుపునిచ్చారు. కేరళ రాష్ట్ర ప్రైవేటు బస్సు యజమానుల సంఘం అధ్యక్షుడు కేఏ మల్లికార్జున్ మాట్లాడుతూ ఈ పరికరాలు ఎక్కడ దొరుకుతున్నాయో స్పష్టంగా చెప్పాలంటూ డిమాండ్ చేశారు. మార్కెట్లో కొన్ని కంపెనీలవి మాత్రమే అందుబాటులో ఉన్నాయని, వాటిన టాంపరింగ్ చేసే అవకాశం ఉందని ఆరోపించారు. ఉత్తర్వులు వెలువరించిన తరువాత అధికారులు 96 బస్సులను తనిఖీ చేశారు. ఇందులో 7 బస్సులకు స్పీడ్ గవర్నెన్స్ లేదని ఫిట్ నెస్ సర్టిఫికేట్స్ రద్దు చేశారు. దీంతో ప్రైవేటు బస్సుల యజమానులు సమ్మెకు పిలుపునిచ్చారు.