: రాగల 24 గంటల్లో విస్తారంగా వర్షాలు: వాతావరణ కేంద్రం
రాగల 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని, దీనికి అనుగుణంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఈ ప్రభావంతో విస్తారంగా వర్షాలు, పలు చోట్ల భారీ వర్షాలు పడతాయని తెలిపింది.