: ఇదో స్పెషల్‌ సైకిల్‌


సైకిల్‌లో స్పెషల్‌ ఏంటి... అనుకుంటున్నారా... ఇది అంధుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన సైకిల్‌ కాబట్టే దీన్ని స్పెషల్‌ సైకిల్‌ అనాల్సిందే. అదేంటి అంధులు ఎలా సైకిల్‌ తొక్కగలరు? అని మీకు మళ్లీ సందేహం వచ్చిందికదా... అందుకే అలాంటి వారికోసమే ఈ సైకిల్‌ను ప్రత్యేకంగా డిజైన్‌ చేశారు.

అల్ట్రాబైక్‌ అనే ఒక ప్రత్యేకమైన సైకిల్‌ను ఫోర్‌సైట్‌ టెక్నాలజీ సంస్థ రూపొందించింది. ఈ సైకిల్‌ అల్ట్రాసోనిక్‌ సెన్సర్లు కలిగివుండి, మార్గమధ్యంలో వచ్చే అవరోధాలను గుర్తిస్తాయి, వీటి సాయంతో కంటిచూపు లేనివారు మరింత స్వతంత్రంగా జీవించవచ్చని దీని తయారీదారులు చెబుతున్నారు. ఈ సైకిల్‌లోని హ్యాండిల్‌ కడ్డీపై టాక్టైల్‌ మీటలు ఉంటాయి. రోడ్డుపై ఏదైనా అవరోధం వస్తున్నప్పుడు అది కంపిస్తుంది. దీనివల్ల సైకిల్‌ను నడిపేవారు దాన్ని తప్పించగలుగుతారు. నడిచేటప్పుడు అంధులకు తమ అవసరాల గురించి తెలియజేసే అల్ట్రాకేన్‌ అనే చేతికర్రలో ఉపయోగించిన పరిజ్ఞానాన్నే ఈ సైకిల్‌లో కూడా వాడారు. బ్రిటన్‌లోని గ్లాస్గో సైన్స్‌ సెంటర్‌ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఈ సైకిల్‌ను ఆవిష్కరించారు. ఇందులో కంట్లో దెబ్బతినని ప్రాంతాలపైకి కాంతిని ప్రసరింపజేసే స్మార్ట్‌ స్పెక్స్‌ అనే కళ్లజోడు, కంట్లోని రెటీనాను స్కాన్‌ చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలను గుర్తించే పరికరం వంటి సాధనాలను కూడా ప్రదర్శనకు ఉంచారు.

  • Loading...

More Telugu News