: అమ్మాయిలకు నచ్చే అబ్బాయిలు ఎవరంటే...


అమ్మాయిలకు ఎలాంటి అబ్బాయిలు నచ్చుతారో సరిగ్గా ఎవరూ చెప్పలేరు. అయితే ఈ విషయంలో పరిశోధకులు ప్రత్యేక పరిశోధనలు చేసి తేల్చిన విషయం ఏమంటే అమ్మాయిలు తమ తండ్రుల్లాంటి లక్షణాలు ఉండే అబ్బాయిలను ఎక్కువగా ఇష్టపడతారట.

ఇంగ్లాండులోని మాంఛెస్టర్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు కొన్ని ప్రత్యేక పరిశోధనల ద్వారా అమ్మాయిలు తమ తండ్రుల్లో ఉన్న లక్షణాలు కలిగివుండే అబ్బాయిలంటే ఎక్కువగా ఇష్టపడతారని తేలింది. ఇందుకోసం శాస్త్రవేత్తలు కొన్ని ఆడ జంతువులపై పరిశోధనలు సాగించారు. వారి పరిశోధనల్లో ఆడ జంతువులు మామూలు వాటికంటే కూడా తమ తండ్రి భౌతిక లక్షణాలతో ఉన్న జంతువులతో సాంగత్యాన్ని ఇష్టపడుతున్నట్టుగా గుర్తించారు. తమ తండ్రిలాంటి లక్షణాలు ఉంటే వాటిని సహచరులుగా ఎన్నుకునేందుకు అవి మొగ్గు చూపుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. మనుషుల్లో కూడా ఇలాంటి ధోరణే ఉండివుండవచ్చని పరిశోధకులు అంచనావేస్తున్నారు. అబ్బాయిల్లో తమ తండ్రిలో ఉండే లక్షణాలు ఉన్నట్టయితే అమ్మాయిలు వారికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. అయితే తండ్రిలోని మంచి లక్షణాలను మాత్రమే! ఈ విషయాన్ని అబ్బాయిలు గుర్తుంచుకుంటే మంచిదేమో!

  • Loading...

More Telugu News