: అలా మనిషిగా మారాం!


కోతి నుంచే మనిషి పుట్టాడని అందరికీ తెలుసు. అయితే మనిషికి, కోతికి  ప్రధాన తేడా లేమిటో ఇపుడు లండన్ శాస్త్రవేత్తలు గుర్తించగలిగారు. మానవ పరిణామ క్రమంలో భాగంగా 25 కోట్ల సంవత్సరాల కాలంలో మనిషి, కోతి నుంచి వేరయ్యాడు. ఈ సమయంలో.. కోతి నుంచి మనిషిగా మారేందుకు మానవ మెదడు అనేక ఆటుపోట్లకు గురయ్యిందని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఈ కారణంగా కోతుల్లో ఉన్న కొన్ని రకాల మెదడు భాగాలు మానవుల్లో లేవని, అలాగే కొత్త భాగాలు పుట్టుకొచ్చాయని వారు తేల్చారు. ఇందులో ప్రధానమైనవి సెరిబ్రల్ కార్టెక్స్ కు ముందు, వెనుక భాగాల్లో ఏర్పడ్డ రెండు ఫంక్షనల్ నెట్ వర్క్స్ కారణమని శాస్త్రవేత్తలు అంటున్నారు.

  • Loading...

More Telugu News