: రెండేళ్లలో మరో ఆర్థిక మాంద్యం
రెండేళ్లలో ప్రపంచం మరో ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోక తప్పదని ప్రముఖ ఇన్వెస్ట్ మెంట్ నిపుణులు జిమ్ రోజర్స్ హెచ్చరించారు. అమెరికాతో పాటు ఇతర సంపన్న దేశాలు ఉద్దీపన ప్యాకేజీలను ఉపసంహరించుకుంటున్నందున... ఈ ఉపద్రవం ఎదురుకానుందని ఆయన అన్నారు. కృత్రిమంగా ద్రవ్య లభ్యతను పెంచుకోవడాని కొన్ని దేశాలు చేసిన ప్రయత్నం... చివరకు ఆయా దేశాల్లో ద్రవ్యోల్బణం పెరగడానికి కారణమయిందని సూత్రీకరించారు. ఇది కరెన్సీ పతనానికి దారి తీసిందని ఆయన చెప్పారు. దీనికి చక్కని ఉదాహరణగా జపాన్ దేశాన్ని పేర్కొన్నారాయన.