: సిరియా రసాయనిక దాడిపై వీడియో సాక్ష్యాల విడుదల


పౌరులపై రసాయనిక ఆయుధాల ప్రయోగంతో 1400మందికిపైగా పౌరులను పొట్టనబెట్టుకున్న సిరియా ప్రభుత్వ రాక్షస చర్యను రుజువు చేసే వీడియోలు వెలుగు చూశాయి. అమెరికా సెనేట్ లోని ఇంటెలిజెన్స్ ప్యానెల్ వీటిని విడుదల చేసింది. ఆగస్టు 21న రాజధాని డమాస్కస్ లో ఆందోళన చేస్తున్న వారిపై విష వాయువును ప్రయోగించడం వల్ల 1429 మంది పౌరులు మరణించినట్లు అమెరికా ఆరోపిస్తోంది. దీంతో పౌరులపై రసాయనిక దాడికి దిగిన సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసాద్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని అమెరికా అధ్యక్షుడు ఒబామా పట్టుదలతో ఉన్నారు.

సిరియాపై పరిమిత కాలపు యుద్ధానికి ఉద్దేశించిన తీర్మానానికి సెనేట్ లోని విదేశీ వ్యవహరాల కమిటీ ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఈ తీర్మానం ఈ వారం సెనేట్, కాంగ్రెస్ ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సెనేట్ ఇంటెలిజెన్స్ ప్యానెల్ సిరియా ప్రభుత్వ దుర్మార్గాన్ని తెలియజేసే వీడియోలను విడుదల చేయడం గమనార్హం. ఈ రెండు సభల్లోనూ తీర్మానానికి ఆమోదం లభిస్తే సిరియాపై సైనిక చర్యకు అమెరికా సర్కారుకు అధికారిక ఆమోదం లభించినట్లే.

  • Loading...

More Telugu News