: జువెలరీ షాప్ లో చోరీ
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని ఒక జువెలరీ షాప్ లో దొంగతనం జరిగింది. దాదాపు నాలుగు కిలోల వెండి, 50 గ్రాముల బంగారాన్ని దుండగులు అపహరించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల ఆళ్లగడ్డలో దొంగతనాలు పెరిగిపోయాయని... పోలీసులు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.