: కోల్ స్కాం టీవీ సీరియల్ ను తలపిస్తోంది: సుష్మా స్వరాజ్


బొగ్గు కుంభకోణంపై ప్రధాన ప్రతిపక్షం బీజేపీ యూపీఏ సర్కారును వదిలిపెట్టడంలేదు. ఈ స్కాంలో ఫైళ్ల గల్లంతుపై పార్లమెంటులో ప్రభుత్వం సరైన వివరణ ఇవ్వకపోవడంతో కమలదళం సమావేశాలను అడ్డుకుంది. ఈ రోజు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆ పార్టీ నేత సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ మాట్లాడుతూ.. పలు ఎపిసోడ్ లతో కోల్ స్కాం టీవీ సీరియల్ లా తయారైందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికది నాలుగు ఎపిసోడ్ లకు చేరుకుందన్నారు. మొదటి ఎపిసోడ్ లో స్కాం బయటపడితే, రెండవ దాంట్లో పేర్లు బయటికొచ్చాయని, తర్వాత ప్రశ్నలు తలెత్తాయని, నాలుగో దాంట్లో ఫైళ్ల గల్లంతు విషయం తెలిసిందని వివరించారు. ఇకముందు ఏం జరుగుతుందో తాము చెప్పలేమని సుష్మ అన్నారు. రూపాయి పతనం, దేశంలోకి చైనా చొరబాటు వంటి అంశాలను సరిగా డీల్ చేయడంలో అధికార పార్టీ తమ అశక్తతను చాటుకుందన్నారు.

  • Loading...

More Telugu News