: ఇలాంటి సభ ఎక్కడా జరగలేదు: అశోక్ బాబు


రాష్ట్ర రాజధానిలో సమైక్యాంధ్ర సభ విజయవంతంగా ముగిసింది. 'సేవ్ ఆంధ్రప్రదేశ్' పేరిట హైదరాబాదు ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ఈ సభలో సమైక్యవాదాన్ని ఘనంగా చాటారు. ఈ సందర్బంగా, ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు మాట్లాడుతూ, ఇలాంటి సభ ఎక్కడా జరగలేదని చెప్పారు. రాజకీయనేతల ప్రమేయంలేకుండా ఇంత పెద్ద ఎత్తున సభ విజయవంతం కావడం ఇదే ప్రథమం అన్నారు. సీమాంధ్రులను కడుపులో పెట్టుకుని చూస్తామన్న తెలంగాణ వాదులు సభను అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేశారని అశోక్ బాబు ప్రశ్నించారు.

కాగా, సభలో మాట్లాడిన వక్తలందరూ రాష్ట్రం ఒక్కటిగా ఉంటేనే సుభిక్షంగా ఉండగలమన్న అభిప్రాయాన్ని వెలువరించారు. రాష్ట్ర విభజన కారణంగా అందరూ నష్టపోతారని, ఏ కొందరి స్వార్థానికో రాష్ట్రాన్ని ముక్కలు చేయడం సరికాదని ఉద్ఘాటించారు. విభజనతో అన్నీ అనర్థాలేనన్నారు. అనంతరం జాతీయగీతాలాపనతో సభ ముగిసింది.

  • Loading...

More Telugu News