: ఇలాంటి వ్యక్తులు స్ఫూర్తిని దెబ్బతీయలేరు: అశోక్ బాబు
సభ దృష్టిని మరల్చడానికి కొందరు ప్రయత్నిస్తారని, అలాంటి వాళ్ళు సమైక్య స్ఫూర్తిని దెబ్బతీయలేరని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు చెప్పారు. హైదరాబాదు ఎల్బీ స్టేడియంలోని సభా వేదిక నుంచి ఆయన మాట్లాడుతూ, సమైక్యవాదులంతా సంయమనం పాటించాలని సూచించారు. తమ ఉద్యమం తెలంగాణ ప్రజలపై కాదని, కాంగ్రెస్ అధిష్ఠానం మనసు మార్చడానికే అని ఆయన స్పష్టం చేశారు.