: తెలంగాణ బంద్ విజయవంతం: దేవీప్రసాద్


తెలంగాణ రాజకీయ జేఏసీ పిలుపునిచ్చిన తెలంగాణ బంద్ విజయవంతమైందని టీఎన్జీవో నేత దేవీప్రసాద్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఏపీఎన్జీవోల సభను చూస్తే ప్రభుత్వం ఎంత అధికార దుర్వినియోగానికి పాల్పడిందో తెలుస్తుందని అన్నారు. బాల్ రాజ్ పై జరిగిన దాడిని ఖండిస్తున్నామని తెలిపారు. కేవలం 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభను విజయవంతం చేయడానికే ప్రభుత్వం విద్యార్ధులను అరెస్టులు చేసిందని విమర్శించారు. ఉస్మానియా యూనివర్సిటీలో భాష్పవాయు ప్రయోగంపై ఆందోళన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News