: నేడు కాశ్మీర్ లో జుబిన్ మెహతా సంగీత కార్యక్రమం
ప్రపంచ ప్రఖ్యాత మ్యూజిక్ కండక్టర్ జుబిన్ మెహతా సంగీత కార్యక్రమం నేడు శ్రీనగర్ లోని షాలిమార్ భాగ్ లో జరగనుంది. దీనికోసం పలువురు మంత్రులు, అధికారులు సహా 1500 మంది ప్రేక్షకులు వస్తారని భావించిన కాశ్మీర్ ప్రభుత్వం భారీ భద్రత ఏర్పాట్లు చేసింది. మరోవైపు ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్న వేర్పాటువాదులు బంద్ కు పిలుపునిచ్చారు. ఈ బంద్ ను కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఖండించారు.