: ఎల్బీ స్డేడియానికి పెద్ద ఎత్తున వస్తున్న ఉద్యోగులు
'సేవ్ ఆంధ్రప్రదేశ్' పేరుతో సమ్యైక్యాంధ్ర పరిరక్షణ సమితి, ఏపీఎన్జీవోలు హైదరాబాదులో నిర్వహిస్తున్న సభకు సీమాంధ్ర జిల్లాల నుంచి ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఎల్బీ స్టేడియంలో సభ మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతుంది. రైళ్లు, ప్రైవేటు బస్సులు, కార్లు, ఇతర వాహనాల్లో వారు హైదరాబాదుకు చేరుకుంటున్నారు. ఇప్పటికే వేలాది మంది ఎల్బీ స్టేడియానికి వచ్చారు. తెలంగాణ జేఏసీ బంద్ కు పిలుపునివ్వడం, ఏపీఎన్జీవోల సభకు వచ్చేవారిని తరిమికొట్టాలంటూ కొన్ని సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రత కల్పించారు. 5 వేల మంది పోలీసులు ఎల్బీ స్టేడియంతోపాటు నగరవ్యాప్తంగా మోహరించి ఉన్నారు. సభకు వచ్చిన ప్రతీ ఉద్యోగికి చెందిన గుర్తింపు కార్డును పరిశీలించిన తర్వాతే పోలీసులు ఎల్బీ స్డేడియంలోకి అనుమతిస్తున్నారు.