: ప్రపంచంలోనే అదిపెద్ద అగ్నిపర్వతం
ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అగ్నిపర్వతాలున్నాయి. ప్రపంచంలో ఇప్పటి వరకూ అతిపెద్ద అగ్నిపర్వతం ఏది అంటే హవాయి దీవుల్లో ఉండే మానలోవా అని చెబుతారేమో... ఇక దాన్ని సవరించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అంతకంటే పెద్దదైన అగ్నిపర్వతాన్ని పరిశోధకులు గుర్తించారు. ఇది పసిఫిక్ మహాసముద్ర గర్భంలో ఉంది. ఇదే ప్రపంచంలోనే అతిపెద్ద అగ్నిపర్వతంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
పసిఫిక్ మహాసముద్రం అన్ని వింతలకు వేదిక. ఈ సముద్రంలో అనేకమైన అగ్నిపర్వతాలున్నాయి. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద అగ్నిపర్వతాన్ని పసిఫిక్ మహాసముద్ర గర్భంలో శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పటి వరకూ సౌరకుటుంబంలో ఉన్న రెండవ అతిపెద్ద అగ్నిపర్వతంగా శాస్త్రవేత్తలు దీన్ని చెబుతున్నారు. ఇది తూర్పు జపాన్‌కు 1,609 కిలోమీటర్ల దూరంలో, సముద్ర గర్భంలో 6,500 అడుగుల లోతులో ఉంది. ఈ అగ్నిపర్వత వైశాల్యం 3,10,798 చదరపు కిలోమీటర్లు. ఇది న్యూ మెక్సికో దేశమంత వైశాల్యంతో దాదాపుగా సమానంగా ఉంది. 'టము మస్సిఫ్'గా వ్యవహరిస్తున్న ఈ అగ్నిపర్వతం సముద్రగర్భంలోని షాట్‌స్కైరైస్ పర్వత శ్రేణుల్లో ఏర్పడింది.