: బంద్ ఉపసంహరించుకోండి: ఎంపీ అనంత


తెలంగాణ వాదులు పిలుపునిచ్చిన బంద్ ను వెంటనే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి కోరారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, రేపటి సభను అడ్డుకునేందుకు తెలంగాణవాదులు బంద్ కు పిలుపు ఇవ్వడం అప్రజాస్వామికమని అన్నారు. హైదరాబాద్ ఏదో ఒక ప్రాంతానిదే అంటే అంగీకరించే ప్రసక్తిలేదని స్పష్టం చేశారు. హైకోర్టులో సీమాంధ్ర న్యాయవాదులపై దాడి ఖండిస్తున్నామని అనంత తెలిపారు. రాష్ట్రం విడిపోతే ఏం జరుగుతుందని భయపడ్డామో అదే జరుగుతోందని, దీన్ని కొనసాగనిస్తే అరాచకం ఏర్పడే అవకాశం ఉందని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News