: ఏడుకోట్ల విజేత ఎవరో.. కౌన్ బనేగా కరోడ్ పతి నేటినుంచే
'కౌన్ బనేగా కరోడ్ పతి' ఏడో సీజన్ నేటి నుంచి ప్రారంభం అవుతోంది. సోనూనిగమ్ పాట.. అమితాబ్ అటతో అభిమానులను అలరిస్తూ ఏడో సీజన్ ఈ రోజు సాయంత్రం 8.30కి ప్రారంభమవుతుంది. మూడో సీజన్ మినహా అన్ని సీజన్లకు అమితాబ్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆరోసీజన్ లో 'ఐదు కోట్లు'గా ఉన్న ప్రైజ్ మనీని నిర్వాహకులు తాజాగా 'ఏడు కోట్ల'కు పెంచారు. విజేతను 'మహా కరోడ్ పతి'గా వ్యవహరించనున్నారు. హాట్ సీట్ కు చేరుకునే అవకాశాన్ని కూడా కఠినతరం చేశారు.
గతంలో తొలి సమాధానం చెప్పేవారికి తొలి అవకాశం అనేలా ఉండేది. ఈసారి మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. గతంలో 12 ప్రశ్నలుంటే ఇప్పుడు 15 ప్రశ్నలున్నాయి. చివరి నాలుగు ప్రశ్నలను 'సప్తకోటి సందూక్'గా వ్యవహరిస్తారు. ఈ ప్రశ్నల బహుమతి కూడా కోటి, 3 కోట్లు, 5 కోట్లు, 7 కోట్లు ఉంటుంది. గతంలో మూడు లైఫ్ లైన్స్ ఉండేవి. ఈసారి వాటిని ఐదుకు పెంచారు. గతంలో ఈ షోని ఫిల్మ్ సిటీలో నిర్వహించేవారు. ఈసారి దీనిని యష్ రాజ్ ఫిల్మ్ స్టూడియోలో చిత్రీకరిస్తున్నారు.