: ఏపీఎన్జీవో అధ్యక్షుడిపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం
ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబుపై కేసు నమోదు చేయాలంటూ హైదరాబాద్ మల్కాజ్ గిరి కోర్టు ఆదేశించింది. 158ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని న్యాయస్థానం సూచించింది. తెలంగాణ వాదులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ న్యాయవాది సంజయ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిని పరిశీలించిన కోర్టు తాజా ఆదేశాలు ఇచ్చింది.