: మధ్యదరా సముద్రంపై యుద్ధమేఘాలు
సిరియా విషయంలో రష్యా తన వైఖరిని ప్రస్ఫుటంగా చాటుతోంది. తిరుగుబాటుదారులపై సిరియా ప్రభుత్వం రసాయనిక దాడులకు పాల్పడిందంటున్న అగ్రరాజ్యం అమెరికా సైనిక చర్యకు ఉవ్విళ్ళూరుతుండగా.. సిరియా సర్కారు ఆ విధమైన దాడి చేయలేదని నమ్ముతున్న రష్యా కదన కుతూహలం కనబరుస్తోంది. ఇప్పటికే సిరియాకు దన్నుగా మూడు యుద్ధనౌకలను మధ్యదరా సముద్రంలో మోహరించిన రష్యా తాజాగా ఓ భారీ యుద్ధ సామగ్రి రవాణా నౌకను సిరియాకు పంపుతోంది. ఈ నౌకలో 'ప్రత్యేక సరంజామా' ఉందని రష్యా నేవీ వర్గాలు వెల్లడించాయి.