: 'ద హిందూ' నుంచి తమిళ దినపత్రిక
ప్రముఖ ఆంగ్ల దినపత్రిక 'ద హిందూ' తమిళ భాషలో దినపత్రికను తీసుకురానుంది. ఈ నెల 16 నుంచి హిందూ తమిళ పత్రిక అక్కడి వారికి అందుబాటులోకి వస్తుంది. దాదాపుగా దీనికి కూడా 'ద హిందూ' అనే పేరునే ఉంచే అవకాశాలు ఉన్నాయి. మరో పేరు కూడా పరిశీలనలో ఉందని 'ద హిందూ' పత్రికను ప్రచురించే కస్తూరి అండ్ సన్స్ లిమిటెడ్ సీఈఓ అరుణ్ అనంత్ తెలిపారు. తమిళనాడులో ప్రముఖ దినపత్రికలు దినతంత్రి, దినకరణ్, దినమలార్ లకు ద హిందూ తమిళ పత్రిక పోటీనివ్వనుంది. ముఖ్యంగా హిందూ ఆంగ్ల పత్రికకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలలో ఎక్కువగా పాఠకులు ఉన్నారు. ఈ నేపథ్యంలో త్వరలో తెలుగు, కన్నడ భాషల్లోనూ ప్రాంతీయ పత్రికలను తీసుకొచ్చే అవకాశాలను కొట్టి పారేయలేం.