: కొండా దంపతులకు కండువాలు కప్పిన డిగ్గీ రాజా
వైఎస్సార్సీపీ పార్టీని వీడిన కొండా సురేఖ దంపతులు కాంగ్రెస్ లో చేరారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆ సమయంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. కొండా దంపతులతో పాటు మరో నేత కేకే మహేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్బంగా కొండా సురేఖ మాట్లాడుతూ, గతంలో మాదిరిగానే పార్టీ కోసం పూర్తిస్థాయిలో శ్రమిస్తామని తెలిపారు. తమ గురించి సీఎం కిరణ్.. దిగ్విజయ్ కు స్పష్టంగా చెప్పారని తెలిపారు. అధిష్ఠానం తెలంగాణ ఇస్తుందన్న నమ్మకం తమకుందని చెప్పారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతర పరిస్థితుల నేపథ్యంలో సురేఖ, ఆమె భర్త జగన్ పార్టీలో చేరారు. అయితే, రాష్ట్ర విభజన ప్రకటన అనంతరం ఆ పార్టీ తెలంగాణ వ్యతిరేక వైఖరి కనబరచడంతో కొండా దంపతులు పార్టీకి గుడ్ బై చెప్పారు.