: ఘనంగా ఐపీఎస్ అధికారి ఉమేశ్ చంద్ర వర్ధంతి


దివంగత ఐపీఎస్ అధికారి ఉమేశ్ చంద్ర 14వ వర్ధంతి హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ కూడలిలో ఘనంగా జరిగింది. ఇక్కడి కూడలిలో ఉన్న ఆయన విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, పలువురు ఐపీఎస్ అధికారులు పాల్గొని నివాళులర్పించారు. విగ్రహానికి పూలమాలలు వేశారు. ఐపీఎస్ అధికారిగా ఉమేశ్ చంద్ర ఎనలేని సేవలు అందించారని ఐజీ వెంకటేశ్వరరావు కొనియాడారు.

  • Loading...

More Telugu News