: ఎంపీ, ఎమ్మెల్యేలపై కేంద్రం అభ్యర్ధనను తిరస్కరించిన సుప్రీం
ఎంపీ, ఎమ్మెల్యేలుగా ఉంటూ ఏదైనా కేసులో ఆరోపణలు ఎదుర్కొని, దోషిగా తేలితే అలాంటి వ్యక్తులు పదవులకు అనర్హులంటూ ఇచ్చిన తీర్పుకు దేశ అత్యున్నత న్యాయస్థానం కట్టుబడింది. ఈ తీర్పును పునఃసమీక్షించాలంటూ కేంద్రం చేసిన అభ్యర్ధనను కోర్టు తిరస్కరించింది. అయితే, కస్టడీలో ఉన్నవారు ఎన్నికల్లో పోటీకి అనర్హులు అన్న తీర్పును తిరిగి పరిశీలించేందుకు న్యాయస్థానం అంగీకరించింది.