: ఫైళ్ల గల్లంతుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి: సుష్మాస్వరాజ్
బొగ్గు శాఖలో కీలక ఫైళ్ల గల్లంతు వ్యవహారంపై సరైన చర్యలు తీసుకునేంతవరకు కేంద్రాన్ని ప్రధాన ప్రతిపక్షం బీజేపీ వదిలిపెట్టే సూచనలు కనిపించడంలేదు. ఫైళ్ల గల్లంతుపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని బీజేపీ పార్లమెంటరీ పక్ష నేత సుష్మాస్వరాజ్ డిమాండు చేశారు. అంతేకాక బొగ్గు క్షేత్రాల కేటాయింపుపై ప్రధాని సీబీఐకి ప్రమాణపూర్వకంగా సాక్ష్యం ఇవ్వాలన్నారు. మరోవైపు ఫైళ్ల అంశంపై ఈ రోజు పార్లమెంటు దద్ధరిల్లింది. విపక్షాలన్నీ సమావేశాలకు అడ్డుతగలడంతో లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ చర్చకు అనుమతి ఇచ్చారు.