: 'బొగ్గు' ఫైళ్ళ గల్లంతుపై లోక్ సభలో గందరగోళం
బొగ్గు శాఖలో కీలక ఫైళ్ళ గల్లంతు అంశం పార్లమెంటులో గందరగోళాన్ని రేపుతోంది. లోక్ సభలో ప్రధాని సమాధానంపై సంతృప్తి చెందని విపక్ష నేతలు ఆందోళనకు దిగారు. మరోవైపు, పెరిగిన పెట్రోలు ధరలపై బీజేపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. చర్చ తక్షణం జరపాలంటూ పట్టుబట్టింది. విపక్ష సభ్యుల ఆందోళనతో బీజేపీ ఇచ్చిన వాయిదా తీర్మానంపై స్పీకర్ చర్చకు అనుమతించారు. బీజేపీ ఎంపీ అనంతకుమార్ చర్చను ప్రారంభిస్తూ పెట్రోధరల పెంపు, రూపాయి పతనంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం ఏం చేస్తోందంటూ నిలదీశారు.