: మహానగరంలో ఆటోలు బంద్
ట్రాఫిక్ పోలీసుల చర్యలకు వ్యతిరేకంగా హైదరాబాద్ లో రాత్రి నుంచి ఆటోలు నిలిచిపోయాయి. నిబంధనలు ఉల్లంఘించిన సమయాలలో కనీస జరిమానాను 1000 రూపాయలకు పెంచడంతోపాటు, ట్రాఫిక్ పోలీసులు ముక్కుపిండి వసూలు చేస్తుండడంతో ఆటోవాలాలు సమ్మెబాట పట్టారు. చలానా మొత్తాన్ని 100 రూపాయలకు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే డిమాండ్ తో ఆటో కార్మికుల సంఘాలు సమ్మెకు దిగాయి. కొన్నిచోట్ల ఆటోలు రోడ్డెక్కగా కార్మికులు అడ్డుకుంటున్నారు. దీంతో ఆటోలన్నీ నిలిచిపోయాయి. దీనికితోడు వ్యాన్లు, డీసీఎం వాహనాల వారూ ట్రాఫిక్ చలానాలను నిరసిస్తూ సమ్మెకు పిలుపునిచ్చారు.