: షేక్స్ పియర్ చదివిన స్కూల్లో అమ్మాయిలకు ప్రవేశం
ప్రముఖ ఆంగ్ల నాటక రచయిత విలియమ్ షేక్స్ పియర్ చదివిన పాఠశాలలో తొలిసారిగా అమ్మాయిలకు అర్హత లభించింది. ఇప్పటివరకు ఆ పాఠశాలలో అబ్బాయిలకే ప్రవేశం ఉండేది. 'కింగ్ ఎడ్వర్డ్-6' పేరిట లండన్ లో ఉన్న ఈ పాఠశాలలో తొలిసారి బాలికలు చదువుకునేందుకు అనుమతి ఇచ్చారు. దాదాపు 38 పాఠశాలల నుంచి 200 మంది బాలికలు ఇక్కడ చదువుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారని బీబీసీ న్యూస్ పేర్కొంది. ఈ మార్పుతో తమ పాఠశాలకు అదనపు ఆకర్షణ వస్తుందని, కొత్త నాటకాలతో బాలికలు తమ నటనా సామర్ధ్యాన్ని కూడా చూపవచ్చునని పాఠాశాల హెడ్ మాస్టర్ బెన్నెట్ కార్ పేర్కొన్నారు. కాగా, ఈ పాఠశాలకు 460 సంవత్సరాల చరిత్ర ఉంది. 1571 నాటికి ఏడేళ్ళ వయసున్న షేక్స్ పియర్ స్ట్రాట్ ఫోర్డ్ లో ఉన్న తన నివాసం నుంచి పావుమైలు దూరంలో ఉన్న ఈ పాఠశాలకు వచ్చి విద్యాభ్యాసం చేసేవాడని చరిత్ర చెబుతోంది.