: తండ్రి పేరిట ట్రస్టు స్థాపించిన అమితాబ్


బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కల నెరవేరింది. తండ్రి డాక్టర్ హరివంశరాయ్ బచ్చన్ స్మారకార్ధం ముంబయిలో ఓ చారిటబుల్ ట్రస్టును స్థాపించాడు. ఈ సందర్భంగా బిగ్ బీ మాట్లాడుతూ.. ఇన్నాళ్ళకు తండ్రి పేరుతో ట్రస్టు స్థాపించడం చాలా ఆనందంగా ఉందన్నాడు. దీనికి సంబంధించి పేపర్ వర్క్ పూర్తయిందని చెప్పాడు. ఈ ట్రస్టును హరివంశరాయ్ బచ్చన్ మెమోరియల్ ట్రస్టు లేదా హెచ్ఆర్ బీ మెమోరియల్ ట్రస్టుగా పిలుస్తారని పేర్కొన్నాడు. భవిష్యత్తులో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు అవసరమైన నిధులు సమీకరిస్తామని అమితాబ్ తెలిపాడు.

  • Loading...

More Telugu News