: పోలీసులకు చిక్కిన దొంగనోట్ల ముఠా


బతుకు దెరువుకు వక్ర మార్గాల బాట పడుతున్నవారి సంఖ్య పెరిగిపోతోంది. కంప్యూటర్ సాయంతో దొంగనోట్లను తయారు చేసి మార్కెట్లో మార్పిడి చేయడానికి ప్రయత్నిస్తూ ఒక ముఠా గుంటూరు జిల్లా బాపట్ల పోలీసులకు చిక్కింది. సుమారుగా 5 లక్షల విలువైన కరెన్సీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

పొన్నూరు వీరరాజు, శ్రీనివాసరెడ్డి అనే ఇద్దరు  వ్యక్తులు లక్ష రూపాయల విలువైన నకిలీ కరెన్సీ నోట్లను వెదుళ్లపల్లిలో ఒక వ్యక్తికి ఇవ్వడానికి వెళుతుండగా బీచ్ రోడ్డులో పోలీసులు పట్టుకున్నారు. వారిని విచారించగా.. కంప్యూటర్ సాయంతో నకిలీ కరెన్సీ తయారు చేస్తున్నారని తేలింది. వారిచ్చిన వివరాల ఆధారంగా మంగళగిరిలోని వీరరాజు నివాసం నుంచి 4 లక్షల రూపాయల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. 

  • Loading...

More Telugu News