: చెన్నై టెస్టులో భారత్ ఘన విజయం
చెన్నై టెస్టులో భారత్ 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. ఆసీస్ విసిరిన 50 పరుగుల స్వల్ప లక్ష్యాన్నిఛేదించే క్రమంలో ఓపెనర్లిద్దరినీ కోల్పోయినా... సచిన్ టెండూల్కర్ వరుస సిక్స్ లతో టీమిండియాను గెలుపు తీరాలకు చేర్చాడు. అంతకుముందు ఆసీస్ తన రెండో ఇన్నింగ్స్ ను 241 పరుగుల వద్ద ముగించింది.
కష్ట సాధ్యం కాని లక్ష్యంతో బరిలో దిగిన భారత్ 36 పరుగులకు ఓపెనర్లు విజయ్ (9), సెహ్వాగ్ (19) వికెట్లు చేజార్చుకుంది. అయితే సచిన్ (13 నాటౌట్)తో కలిసి యువ ఆటగాడు పుజారా (8 నాటౌట్) లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఇక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును డబుల్ సెంచరీ హీరో ధోనీ కైవసం చేసుకున్నాడు.
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 380 పరుగులు చేయగా.. భారత్ 572 పరుగులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో నాలుగు టెస్టుల సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంలో దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు మార్చి 2 నుంచి హైదరాబాద్ లో జరగనుంది.