: ఇది మాటలను నేర్పుతుంది!


మాటలను ఒకరు నేర్పడం ఏంటి... మనమే మాట్లాడతాంకదా... అనుకుంటున్నారా... అదేంకాదు... ఇది పదిమందిలో మాట్లాడడానికి ఇబ్బంది పడేవారికోసం తయారుచేసిన కంప్యూటర్‌. ఈ కంప్యూటర్‌ పదిమందిలో మాట్లాడేందుకు ఇబ్బందిపడేవారికి, అలాగే ఇంటర్వ్యూల్లో సమాధానాలను చెప్పడానికి భయపడేవారికోసం తయారు చేయబడింది. ఈ కంప్యూటర్‌ను ఉపయోగించడం ద్వారా మన సామాజిక భాషా నైపుణ్యాలను మెరుగుపరచుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

బోస్టన్‌లోని ఎంఐటీ శాస్త్రవేత్తలు ఒక కంప్యూటర్‌ను తయారు చేశారు. ఈ కంప్యూటర్‌ పేరు 'మై ఆటోమేటెడ్‌ కాన్వర్జేషన్‌ కోచ్‌'. పదిమందిలో మాట్లాడేందుకు ఇబ్బందిపడేవారు. ఇంటర్వ్యూల్లో సమాధానాలు చెప్పడానికి భయపడేవారు ఇక ఇలాంటి సమస్యలనుండి ఈ కంప్యూటర్‌ ద్వారా సులభంగా బయటపడొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. మానసిక స్థితి సరిగా లేనివారు, సరళంగా మాట్లాడలేనివారిని దృష్టిలో పెట్టుకుని ఈ కంప్యూటర్‌ను తయారు చేశారు. వెబ్‌ కెమెరా సాయంతో వ్యక్తుల ముఖ కవళికలను, గొంతు, శరీరం భాష, పద ప్రయోగం వంటి వివిధ అంశాలను ఈ సాఫ్ట్‌వేర్‌ అర్థం చేసుకుంటుంది. ఎంత సమర్ధవంతంగా సంభాషిస్తున్నామనే విషయాన్ని ఈ కంప్యూటరు అంచనావేసి మన సంభాషణలోని లోపాలను చెబుతుంది. అలాగే వెబ్‌ కెమెరాతో తీసిన వీడియోలోని వ్యక్తిని పోలిన పాత్రను సృష్టించి, అదే భావం వచ్చేట్టు ఎదుటివారితో ఇంకా ఎంత సమర్ధవంతంగా మాట్లాడవచ్చు అనే విషయాన్ని ఈ పాత్ర ద్వారా కంప్యూటర్‌ చెప్పిస్తుంది.

  • Loading...

More Telugu News