: ధర్మవరం లో లక్ష గళార్చన


జనం..జనం..జనం ఎటు చూసినా జనమే. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఏ మండల కేంద్రాన్ని చూసినా లేక జిల్లా కేంద్రాన్ని చూసినా ఉద్యమంలో పాలు పంచుకుంటున్న సమైక్యవాదులే కనిపిస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లా ధర్మవరంలోని పొట్టి శ్రీరాములు కూడలిలో ఏర్పాటు చేసిన లక్షగళార్చనలో సమైక్యవాదులు భారీ సంఖ్యలో పాల్గొని రాష్ట్రం సమైక్యంగా ఉండాలని నినదించారు. ఉద్యోగుల జేఏసీ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉద్యోగులు, సమీప గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో ధర్మవరం, పుట్టపర్తి మార్గంలో ఎటు చూసినా జనాలే కనబడ్డారు. సమైక్యాంధ్ర నినాదాలతో ధర్మవరం దద్దరిల్లింది.

  • Loading...

More Telugu News